చేగుంట 25/03/24 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఘనంగా హోలీ సంబరాలు. చేగుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు శుభాకాంక్షలు తెలిపి, రంగులు చలిన ఉపాధ్యాయుల, యువకులు. ఈ సందర్భంగా చేగుంట ఎస్ ఐ బాలరాజ్ మాట్లాడుతూ దేశమంతా దీపావళి తర్వాత అత్యంత వేడుకగా జరుపుకునే హోలీ అని, ఈ పండగ పురాణ కాలం నుంచి జరుపుకునే పండగని వారన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ , ఉపాధ్యాయులు ఆంజనేయులు, రమేష్,రామకృష్ణ, యువజన నాయకులు రాజు, రవి, కానిస్టేబుల్ లు రమేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
