అమాయక వికలాంగ మహిళతో సహజీవనం
పెళ్లి చేసుకొని మోసం చేసిన మహిళ
మని అడిగితే గుండాలతో కొట్టించిన వైనం
ఎట్టకేలకు ఎస్.పి.ఆఫీసుకు చేరిన పంచాయతీ
జగిత్యాల, ఏప్రిల్ 21: పుట్టుకతో దివ్యంగురాలైన ఓ యువతి కాళ్ళు లేకున్నా చిన్న కిరాణంతో స్వయం ఉపాధి పొందుతుండగా పక్కింటికి చెందిన ఓ యువతి ఈ వికలాంగురాలితో స్నేహం చేసి శారీరక సంబంధం పెట్టుకొని 35 లక్షల వరకు డబ్బులు గుంజి గుండాలతో కొట్టించగా చివరకు జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఇది. వివరాల్లోకి పోతే మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి కిరాణా దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తోంది. తల్లి తండ్రుల మరణాంతరము వచ్చిన డబ్బును మధింపుచేస్తూ వ్యాపారంలో వచ్చిన డబ్బులను పోగు చేస్తోంది. ఈ వికలాంగురాలి సొమ్ముపై కన్ను పెట్టిన పక్కింటికి చెందిన నర్మద అనే యువతి ఈ వికలాంగురాలితో శారీరక సంబంధం పెట్టుకొంది. సమాజము ఏమనుకొన్నా పట్టించుకొనేది లేదనే మాయమాటలు చెప్పి ఆ వికలాంగులారికి మాయమాటలు చెప్పి 11 లక్షల 70 వేల రూపాయల వరకు ఫోన్ పే ద్వారా లాక్కున్న నర్మద మరో 23 లక్షల 30 వేల రూపాయల వరకు నగదుగా పొందిందని బాధితురాలు పేర్కొంది. ఎట్టకేలకు నర్మదకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడగా ఒక పోలీసుతో నర్మదకు పెళ్లి జరిగింది. ఈ సమయంలో నాకు పెళ్లి జరిగినా నా భర్త లేని సమయంలో నీతో సహజీవనం చేస్తానని మాట ఇచ్చిందని ఎంగేజ్ మెంట్ సమయంలో నర్మద లక్ష రూపాయలను తీసుకొన్నట్లు బాధితురాలు పేర్కొంది. అలాగె పెళ్లికి తులం బంగారం తీసుకొందని తీరా పెండ్లి జరిగి భర్తతో కాపురం చేసుకొంటున్న నర్మద అప్పటి నుంచి బాధితురాలిని పట్టించుకోవడం మానేసిందని చివరకు నాడబ్బులు ఇవ్వమని వికలాంగురాలైన బాధితురాలు అడిగితే వాల్గొండ ఊర్లో ఆరుగురు గుండాలతో విచక్షణారాహిత్యంగా కొట్టించగా బాధితురాలు మల్లాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా చికిష్టకై జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితురాలు తమ సంఘం జగిత్యాల జిల్లా దివ్యాన్గుల హక్కుల సంక్షేమ పోరాట సమితి అద్యక్షులు లంక దాసరి శ్రీనివాస్ ను ఆశ్రయించగా జిల్లా ఎస్పీకి బాధితురాలి పక్షాన ఫిర్యాదు చేరింది.