మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టర్ తల్లాడ మండలం నూతనకల్, తల్లాడ, కల్లూరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు- మన బడి క్రింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల పునః ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తవ్వాలని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతనకల్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 29.65 లక్షల అంచనాలతో పనులు చేపట్టినట్లు, ఇందులో రూ. 22 లక్షలు మన ఊరు-మన బడి, రూ. 7.65 లక్షలు ఉపాధిహామీ నిధుల క్రింద చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్లాబ్ మరమ్మత్తులు, పూర్తయినట్లు, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, విద్యుద్దీకరణ పనులు ప్రగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు.
తల్లాడ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు రూ. 46 లక్షల అంచనాలతో చేపట్టినట్లు ఆయన తెలిపారు. డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ బ్లాకులు, మేజర్, మైనర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ, త్రాగునీటి వసతి పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు.
కల్లూరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు రూ. 62 లక్షలతో చేపట్టినట్లు ఆయన తెలిపారు. డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్, టాయిలెట్ బ్లాకుల నిర్మాణం చేపట్టినట్లు ఆయన అన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆయన తెలిపారు. మేజర్, మైనర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్నారు.
పాఠశాలలకు మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానళ్లు తరగతి గదుల్లో బిగించి, పరీక్షించాలన్నారు. బోర్డు, డిజిటల్ అన్ని అవసరాలకు ఇట్టి ప్యానళ్లు ఉపయుక్తంగా వుంటాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking