నియోజకవర్గాల్లో మంజూరయిన మినీ స్టేడియం నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, క్రీడాకారులకు అందుబాటులో తేవాలి
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం) ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, వైరా నియోజకవర్గం వైరా లో మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ. 3.40 కోట్ల వ్యయంతో సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇండోర్ లో బ్యాడ్మింటిన్, కబాడ్డి, జిమ్, టేబుల్ టెన్నిస్ టెన్నిస్ క్రీడలు, అవుట్ డోర్ లో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్ సింథిటిక్ కోర్ట్, వాలీబాల్, క్రికెట్, ఫుట్ బాల్, ఖోఖో, ఓపెన్ జిమ్ లు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు. ఇండోర్ స్టేడియంలో పనులు పూర్తయినట్లు, ఆఫీస్ రూమ్, లాకర్ రూమ్, టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అవుట్ డోర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు వేగంగా పూర్తిచేస్తున్న కాంట్రాక్టర్ నాగేశ్వరరావు ను కలెక్టర్ అభినందించారు.
వైరా మినీ స్టేడియం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైరాలో అవుట్ డోర్ లో చేపట్టిన బ్యాడ్మింటిన్ కోర్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఇండోర్ షటిల్ కోర్ట్ మిగులు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.స్టేడియంలో విద్యార్థులను రప్పించి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు. కోచ్ లను అందుబాటులో ఉంచి, మంచి శిక్షణ ఇవ్వాలన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, పీఆర్ ఇఇ లు కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, తహశీల్దార్లు అరుణ, బాబ్జి ప్రసాద్, వైరా మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లు శ్రీదేవి, రవికుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.