ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అభినందనలు
విశాఖపట్నం మార్చ్ 16);ఏపీ సీఎం జగన్ బీసీల కొరకు 2023 24 బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ 38 వేల 605 కోట్లు బీసీలకు కేటాయించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణుమాధవ్ హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా విశాఖపట్నం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. నవరత్నాలతో కలుపుకుంటే ఇది దేశ చరిత్రలో గొప్ప బీసీల బడ్జెట్అని మొత్తం కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల పైగా ఈ సంవత్సరంలో నవరత్నాలు పథకాల ద్వారా బీసీలకు అందే అవకాశం ఉందని ఈ రకమైన బడ్జెట్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు బీసీల కొరకు కేటాయించలేదని ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలిపారు.