టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలన్నీ లీక్ పై సిబిఐ చే విచారణ జరిపించాలి

నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యo
హైదరాబాద్ మార్చ్ 16 :టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ పై సిబిఐ చే విచారణ జరిపించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేసారు.- నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందేనని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ప్రత్యెక తెలంగాణా రాష్ట్రము రాకముందు 2014 లో 1,91,000 ఖాళీలు ఉండగా వాటిని భర్తీ చేయక పొగ గడచినా 8 సంవత్సరాలకు గాను 66 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయవలసి వస్తుందన్న దురుద్దేశం తో పేపర్ లీకేజ్లకు అవకాశం ఇచ్చి ఏమి తెలువనట్టు ప్రభుత్వం నంగనాచి ల వ్యవహరిస్తుందని గుజ్జ సత్యం ఆరోపించారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందే నన్నారు.ఉద్యోగాలివ్వలేక…ఇంత దారుణాలకు ఒడిగడతారా? అని ప్రశ్నించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందన్నారు. టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటి ఘటన జరగడం అంత సులువు కాదని అన్నారు. ప్రభుత్వ హయాంలో హయాంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీకేజీ అయ్యాయనే అనుమానం కలుగుతోందన్నారు. ఇట్టి విషయమై గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగాలకున్న డిమాండ్‌ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమన్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్‌ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది. తెలంగాణను ఆర్దికంగా పూర్తిగా దివాళా తీయించిన ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి… నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. గతంలో జోన్ల పేరుతో, గుణాత్మక మార్పు పేరుతో ప్రభుత్వం సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఆ తరువాత ప్రతిపక్షాలను, కోర్టు కేసులను బూచీగా చూపి ఉద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమీపించడంతోపాటు లీకేజీ, ఉద్యోగుల ప్యాకేజీ పేరుతో డ్యామేజీ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేయడం క్షమించరాని నేరమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking