యూత్ నాయకులు సిందే చంద్రం.
మెదక్ ప్రజా బలం న్యూస్ :-మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండల్ మురందరి రాధా (60000 రూపాయలు) మరియు భగీర్తిపల్లిగ్రామానికి చెందిన మ్యాకల షేకులు (60000 రూపాయల ) చెక్కులను ఇద్దరికి స్థానిక ప్రాజప్రతినిధుల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా,
సీఎం రిలీఫ్ ఫండ్ రెండు చెక్కులను గురువారం నాడు సిందే చంద్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ విభాగం సిందే చంద్రం మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆపత్కాలంలో ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్, మంత్రివర్యులు హరీష్ రావు కు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు, ముఖ్యమంత్రి సహాయనిధి ఆపత్కాలంలో ప్రాణాలు నిలిపే సంజీవని అన్నారు,ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి ఈ డబ్బులు కొండంత అండగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దయానంద్ గడ్డం వెంకటేష్, శ్రీకాంత్, శేఖర్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.