-ప్రారంభించిన జనరల్ మేనేజర్ జి.దేవేందర్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 25:
మందమర్రి ఏరియాలోని కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 40 టన్నుల క్రేన్‌ను జనరల్ మేనేజర్ జి. దేవేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రేన్ ప్రారంభంతో కే.కే ఓ.సి ప్రాజెక్టు పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా సాగే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్ వంశీధర్, ఇంచార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, పిట్ సెక్రటరీ మర్రి కుమారస్వామి, మందమర్రి సీ.ఏం. ఓ.ఏ.ఐ ప్రెసిడెంట్ రమేష్, ఏ.ఐ. టి.యూ.సీ ఇంచార్జ్ అంజనేయులు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.