మందమర్రి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలి
-ఆర్.పి.ఐ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 25:
సింగరేణి ప్రాంతంలో నూతన బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా (ఆధవాలే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్ అన్నారు. మందమరి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు సరిగోమ్ముల స్నేహలత, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ లతో కలిసి మాట్లాడారు. ముందుగా జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో ఉగ్రదాడులో ఊచకోతకు 26 మంది బలైన అమరుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ మందమర్రి మున్సిపల్ కు ఎన్నికలు నిర్వహించాలని అలాగే సింగరేణి ప్రాంతంలో భూగర్భ గనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం స్వరాజ్యం ఏర్పడితే మందమర్రికి మునిసిపల్ ఎన్నికలు జరిపిస్తామని హామీలు ఇచ్చి అధికారం రాగానే హామీలను తుంగలో తొక్కారాన్నారు. అలాగే సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్లు కాకుండా అన్ని భూగర్భ ఘనులు తీసుకువస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఊక దంపుడు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైందని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను మేనిఫెస్టోను పెట్టి అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేక పోయిందన్నారు. ఈసమావేశంలో
పులిపాక శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి, గుడికందుల తిరుపతి జిల్లా అధ్యక్షులు, రహమత్ ఖాన్ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు, ధరంపురి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు, గరిగే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి
లక్కాకుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి
మామిడిపల్లి ప్రకాష్, జిల్లా కార్యదర్శి
భారత తిరుపతి, జిల్లా నాయకులు
కన్నూరు కృష్ణ,
తాజుద్దీన్, శంకర్,
శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.