అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది
మెడిగడ్డ,అన్నారం,సిందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి
అయినా ప్రజలను బి.ఆర్.ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది
ఆ పార్టీ తెలంగాణా రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
కాళేశ్వరం బి.ఆర్.ఎస్ సొంత జాగీర్ కాదు
పజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు సిగ్గు పడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
బి.ఆర్.ఎస్ పాలనలో కట్టిన ఈ ప్రాజెక్టు వారి పాలనలోనే కుప్ప కూలిపోయిందని ఆయన మండిపడ్డారు.
మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లు ఎందుకూ పనికి రాకుండా పోయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బి.ఆర్.ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీలతో లక్ష కోట్లు ఋణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు
ఇంత జరిగాక కుడా బి.ఆర్.ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ బి.ఆర్.ఎస్ సొంత జాగీర్ కాదని,ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.