విద్యార్థుల కొరకు వేసవి విజ్ఞాన శిబిరం

 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : విద్యార్థుల కొరకు వేసవి విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరం-2025ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య,జిల్లా సైన్స్ అధికారి మధుబాబు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…నిత్య జీవితంలో సైన్స్ ఎంతగా ఉపయోగపడుతుందో విద్యార్థులు నిశితంగా గమనించాలని,వాటి వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవాలని తెలిపారు.చాలా మంది సైన్స్ సూత్రాలను తెలియకుండా వినియోగిస్తున్నారని,సైన్స్ లోని సూత్రాలను తెలుసుకునేందుకు వేసవి శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాల వారిగా నేర్చుకుంటారని, కానీ ఇక్కడ ఆలోచనలోకి వచ్చే ప్రతి సమస్యను పరిష్కారం తెలుస్తుందని, ప్రతి విద్యార్థి ఆలోచన శక్తిని పెంపొందించుకునేలా ఈ శిబిరం విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు.వేసవి ఉష్ణోగ్రత పెరుగుతున్న దృష్ట్యా శిబిరానికి వచ్చే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఇప్పటి వరకు 186 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 120 మందికి అవకాశం కల్పించడం జరిగిందని,విద్యార్థులను ఆలోచింపజేసేలా ప్రయోగాలతో విషయ పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు చౌదరి శ్రీనివాస్,సత్యనారాయణ మూర్తి,జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్రెడ్డి,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking