చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

 

అందోల్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 25(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/మునిపల్లి: వ్యవసాయ పొలం లోని మేడి చెట్టుకు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం నాడు బుదేరా గ్రామ శివారులో చోటు చేసుకుంది,వివరాలలోకి వెళితే, మునిపల్లి మండల పరిధిలోని బుదేరా గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చెట్టుకు వేలడుతూ గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న వ్యక్తిని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న మునిపల్లి ఎస్సై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టగా బుదేరా గ్రామానికి చెందిన కోలుకుందా శ్రీనివాస్(40) గా తెలిసింది, ఈ విషయాన్ని బుదేరా గ్రామంలోని కోలుకుందా శ్రీనివాస్ కోలుకుందా స్వప్నకు తెలియజేయగా 23.04.2025 నాడు ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపినది.మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking