తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అల్లం నరేందర్,ఎస్సై సురేష్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రబోర్ లోని ఎయిర్టెల్ టవర్ ఏరియాలో గురువారం రాత్రి చోరీ జరిగింది.బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్మీలో పని చేస్తున్న బొప్పు శ్రీనివాస్ గురువారం తాళం వేసి వెంకట్రావు పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లామన్నారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. సుమారుగా రెండున్నర తులాల బంగారు గొలుసు, ఇరవై తులాల వెండి,35 వేల రూపాయలు నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే సీఐ అల్లం నరేందర్,ఎస్సై గోపతి సురేష్,తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధితుడి పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.