మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

 

*మండల స్థాయిలో డ్రగ్స్ నియంత్రణపై సమావేశాలు నిర్వహించాలి

*గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి

*మాదక ద్రవ్యాల పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఏప్రిల్-25 (ప్రజా బలం ప్రతినిధి)మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రస్తుతం క్రాప్ కటింగ్ పరిశోధనలు జరుపుతున్నారని, వీరితో సమయం చేసుకుంటూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.పాఠశాలలో ముగుస్తున్నందున పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు.జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న బార్లు, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు. బార్ నిర్వాహకులతో వాట్స్ అప్ గ్రూప్ తయారు చేయాలని ప్రతి రోజూ ఎప్పుడు మూసి వేస్తున్నారో సమాచారం అందించాలని అన్నారు.డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అవగాహన కార్యక్రమాల్లో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు. డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సెస్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యారోగశాఖ అధికారికి సూచించారు. కళాశాలలో సడన్ గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇటుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ చిన్న సంఖ్య లో ఉన్నా కూడా తప్పనిసరిగా సీజ్ చేయాలని అన్నారు. జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ బంద్ చేయాలని అన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో వైన్ షాప్ ఉండకుండా చూడాలని అన్నారు.గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, మా దగ్గర అవసరమైన మేర డ్రగ్స్ నిర్దారణ కిట్లు, నార్కోటిక్స్ గుర్తించే డాగ్స్ అందుబాటులో ఉన్నాయని వెంటనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్స్, హ్యాండ్ బుక్ లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి , అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష,విద్యా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking