ప్రజావాణికి 49 ఆర్జీలు- ఆర్జీలు స్వీకరించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించిన …..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ఏప్రిల్:10 ప్రజ బలం ప్రతినిది:
సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అధనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో మొత్తం (49) ఆర్జీలు రాగా,అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి (19) అర్జీలు రాగా, ఎస్సీ కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పంచాయితీ, హౌసింగ్,మహిళా శిశు, వికలాంగుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, తదితర శాఖలకు సంబంధించి ( 30 ) దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఇచ్చి వెంటనే సమస్య పరిష్కరించాలని సూచించారు. తమ పరిధిలో పరిష్కరించదగినవి వెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయరాదని సూచించారు.
భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని, పింఛన్లు, స్వయం ఉపాధికి రుణం మంజూరు, ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం కల్పించాలని, మూడు చక్రాల కుర్చీ ఇప్పించాలని, తదితర సమస్యలపై ఆర్జీలు అందాయి.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టరేట్ ఏఓ,తదితరులు పాల్గొన్నారు.