ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ లో ఈ నెల 14 వ తేదీన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కు ఏ.ఐ.సీ.సీ.అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వెల్లడించారు. నస్పూర్ లోని నిర్వహించే సభా మైదానంను వారు పరిశీలించారు.కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సభ నెల 14 వ తేదీన ఖరారు అయినట్లు తెలిపారు. మల్లిఖార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ లో తొలిసారి మంచిర్యాలజిల్లా లో ఏర్పాటు చేస్తున్న సభకు హాజరవుతున్నట్లు వారు చెప్పారు.అంబేద్కర్ జయంతి రోజున సభను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.సభ సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమవుతుందని తెలిపారు.సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్,జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జైరాం రమేష్,కొప్పుల రాజు,పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు,జాతీయ,రాష్ట్రీయ ముఖ్య నేతలు హాజరవుతారని వారు తెలిపారు.