తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిని వివరించండి మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని బీ ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.సోమవారం పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ప్రచారం చేయాలన్నారు.తెలంగాణ ఏర్పడక ముందు నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ప్రస్తుతం ఎలా ఉన్నాయో కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తే వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ విజయం తథ్యమని జ్యోసం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం మరువలేమన్నారు.కాంగ్రెస్, బీజేపీ లు ప్రజల కష్టాలను పట్టించుకోని పార్టీలని వాటి ఉనికి కోసమే నేడు అధికార పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతకుమిందు ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…రైతు బందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఉచిత విద్యుత్,ఆసరా,గురుకుల పాఠశాలల ఏర్పాటు లాంటివి చేసి కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడని వివరించారు.కార్యకర్తలు,నాయకులు ప్రతి పక్ష పార్టీలకు ధీటుగా జవాబు చెప్పాలని మనోదైర్యం నింపారు.గూడెం లిఫ్ట్ ద్వారా వందల కోట్ల పంటలు పండుతున్న తీరు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఏద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు,డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీ ఆర్ ఎస్ మండలధ్యక్షుడు చుంచు చిన్నయ్య,పట్టణ ఆధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ డీసీ ఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యల తిరుపతి,సర్పంచ్ లు సొల్లు సురేష్,గోళ్ళ రవీందర్,చుంచు రవి,ఎల్తాపు సునీత సుధాకర్,బానోత్ జయంత్,బండి సత్తయ్య, రాగుల రాజేశం,గణవేణి శైలజ సుధాకర్ మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య,ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking