స్థానిక సంస్థలలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి

-వి.హెచ్.పి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 26

స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పట్టణంలోని గ్రేస్ లిటిల్ ఆర్ట్స్ స్కూల్ సమీపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ హాజరైనారు. ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని బ్యాక్ లాక్ ఉద్యోగాలు భర్తీ, స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు దీవ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి, నామినేటెడ్ పోస్టులలో* వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, 2016 చట్టాన్ని అన్ని శాఖలు అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. పూర్తిగా నడవలేనటువంటి (కండరాల క్షీణత) వికలాంగులకు15 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన దివ్యాంగులకు 4000 పెన్షన్ నుంచి 6000 వెంటనే అమలు చేయాలన్నారు. విద్య వైద్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నడవలేని పూర్తిగా వైకల్యం గల వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు ఇవ్వాలన్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటుకు బ్యాంకులు సహకరించాలి అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంపులు నిర్మించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలలో వికలాంగులకు ఫీజులో పూర్తి రాయితీని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బివి అప్పారావు, ఇందూరి రమేష్, దురిశెట్టి లక్ష్మణ్, రామ్ శ్రీనివాస్, షేక్ రావు లక్ష్మణ్, రామటైంకి సుధాకర్, తోట తిరుపతి, నరేష్, దేవి ప్రకాష్, రాజశేఖర్, జిల్లా మహిళ నాయకురాలు బానోతు సుశీల, ధనలక్ష్మి, అఖిల, భీమేశ్వరి, ప్రశాంతి, లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking