న్యాయవాదులు లైబ్రరీ ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి:కరీంనగర్‌ న్యాయవాదులకు డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు నిమిత్తం నిధులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ న్యాయవాదులకు హామీ ఇచ్చాడు. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పివి రాజ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి భేతి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రి కి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పివి రాజ్‌ కుమార్‌ 1500 కు పైగా ఉన్న న్యాయవాదులు ఉన్న కరీంనగర్‌ బార్‌ అసోసియేషకు, న్యాయవాదులు మీటింగ్‌ ఏర్పాటు చేసుకోవడానికి ఒక్క కాన్ఫరెన్స్‌ హాల్‌, న్యాయవాదులకు డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు నిమిత్తం నిధులు మందులు చేయాలని కోరారు, వెంటనే స్పందించిన మంత్రి సంక్రాంతి లోపు డిజిటల్‌ లైబ్రరీకి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఉపాధ్యక్షులు రఘువీర్‌, జాయింట్‌ సెక్రెటరీ బీమా సాహెబ్‌, లైబ్రరీ సెక్రెటరీ కటకం రాజేందర్‌, స్పోర్ట్స్‌ సెక్రెటరీ మేడిపల్లి రవి, సీనియర్‌ ఈసీ నెంబర్‌ సుంకి దేవికిషన్‌, బెజ్జంకి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking