ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 26
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెద్దనపల్లి పదో వార్డులో పోలీసులు గురువారం కార్దన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 40 మోటార్ సైకిల్ లు ఒక
ఆటో డాక్యుమెంట్స్ లేని పేపర్లను చెక్ చేసి మిగతా వాటిని ఫైన్ విధించారు. అనంతరం ఆయా వార్డుల ప్రజలని ఉద్దేశించి మందమర్రి సీ.ఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వెహికల్ కి డాక్యుమెంట్స్ మరియు ఇన్సూరెన్స్ పేపర్లు ఉండాలన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని అలాగే బెక్స్ పై అవగాహన కల్పించి సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పిస్తూ ప్రతి ఏరియాలో ఒక సీసీ కెమెరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎవరైనా కొత్త వ్యక్తులు మీరేకు వస్తే పోలీస్ స్టేషన్కు తెలియపరచాలని ఏదైనా సమస్య ఉంటే తక్షణమే 100 కాల్ చేయాలని ప్రజలకు తెలియపరిచారన్నారు. ఈకార్యక్రమంలో కాసిపేట ఎస్సై ప్రవీణ్, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, మందమర్రి అడిషనల్ ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.