సింగరేణి సంస్థ సామాజిక సేవలో ముందుంటుంది

-మందమర్రి ఏరియా జిఎం జి దేవేందర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 26

సింగరేణి సంస్థ ఉత్పత్తితోపాటు సామాజిక సేవలో కూడ ముందుంటుందని మందమరి ఏరియా జిఎం జి దేవేందర్ అన్నారు. గురువారం మందమర్రి వృత్తి శిక్షణ కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన నూతన కార్మికులు, గనులు మరియు డిపార్ట్మెంట్ల కార్మికులతో రక్తదానం చేయడం చాలా అభినందనీయమని అన్నారు. గతంలో మందమర్రి వృత్తి శిక్షణ కేంద్రంలో అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించారని గుర్తు చేశారు. జిల్లాలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులు అధికంగా ఉన్నారని వీరికి ప్రతినెల రక్తం అవసరం ఉంటుందని. సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు సామాజిక సేవలో కూడా ముందుంటుందని అన్నారు. ప్రతినెల వీరికి రక్తదాన శిబిరాలు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రము మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు.జి.ఎం విజయప్రసాద్, వృత్తి శిక్షణ కేంద్రం మేనేజర్ శంకర్, ట్రైనింగ్ అధికారి అశోక్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర సత్యనారాయణ,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యులు సూరం లక్ష్మీనారాయణ, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking