59 జీవో లబ్దిదారులకు అందిన నోటీసులు పున: పరిశీలించాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

కుత్బుల్లాపూర్‌ ప్రజాబలం ప్రతినిధి:మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 59 జీవో లబ్దిదారులకు లక్షల రూపాయలు చెల్లించాలని అందిన డిమాండ్‌ నోటీసులను పున: పరిశీలించాలని సోమవారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ మేడ్చల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ… నామ మాత్రపు రుసుము తో పేదల భూములు క్రమబద్దీకరించాల్సింది పోయి, 59 జీవో తో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని అన్నారు. 2014 నాటి మార్కెట్‌ విలువ కాకుండా, ప్రస్తుత మార్కెట్‌ విలువ కు అనుగుణంగా డిమాండ్‌ నోటీసులు పంపడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నోటీసులు పున: పరిశీలన చేసి, నామమాత్రపు రుసుము తో పేదలకు అందించాలని అన్నారు. 58,59 జీవో కింద వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసారు. ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ తరపున పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు చండి శ్రీనివాస్‌, అసెంబ్లీ కన్వీనర్‌ బుచ్చి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్‌, భావిగడ్డ రవి, ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు సదానందం, పత్తి రఘుపతి, జిల్లా కార్యదర్శి జగన్‌ మోహన్‌ రావ్‌, అధికార ప్రతినిది సురేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking