చిన్న ఉపగ్రహాల అభివృద్ధిలో ధృవతార సంజయ్ నెక్కంటి

 

సంజయ్ కి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందించిన ఆకృతి సంస్థ

అంతరిక్ష పరిశోధనలలో, చిన్న ఉపగ్రహాల అభివృద్ధిలో నిమగ్నమై రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించి దేశ గౌరవాన్ని పెంచిన సంజయ్ నెక్కంటి దేశం గర్వించదగ్గ యువ శాస్త్రవేత్త, యువ పారిశ్రామిక వేత్త అని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష పరిశోధనలను ప్రైవేట్ రంగం ద్వారా నిర్వహించిన ఘనత సంజయ్ నెక్కంటి ఆధ్వర్యంలోని ధ్రువ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్ కు దక్కింది అన్నారు.
సోమవారం నాడు ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని సంజయ్ నెక్కంటికి ఆకృతి యువ ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం అందజేసారు.ఈ కార్యక్రమం హైదర్ గూడ న్యూ సర్వీస్ సిండికేట్ (ఎన్.ఎస్.ఎస్.) లో జరిగింది. సమన్యయకర్తగా అకృతి సుధాకర్ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, విశిష్ట అతిది గా విచ్చేసిన మాజీ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస రావు, ప్రసంగిస్తూ భారతదేశం లో ప్రతిభకు కొదువ లేదు అన్నారు. సంజయ్ నెక్కంటి లాంటి ప్రతిభావంతులైన సైంటిస్టు లకు సహ కారం అందిస్తే నూతన ఆవిష్కరణ లు చేపట్టవచ్చు అన్నారు. కార్యక్రమం లో జూబ్లీ హిల్స్ వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్ రావు,దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. వకుళాభరణం ప్రసంగిస్తూ అంతరిక్ష పరిశోధనా రంగంలో తన 19 ఏళ్ళ వయస్సులోనే అధ్యయన పరిశోధనలు ఆరంభించిన నెక్కంటి సంజయ్ ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో అంతరిక్ష పరిశోధనలకు గాను స్టార్టప్ ను నెలకొల్పిన ఘనత సాధించారన్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ధృవ స్పేస్ సంస్థకు జాతీయ స్టార్టప్ అవార్డు ను అందజేయడం గమనించదగిందన్నారు. బెస్ట్ స్పేస్ టెక్ స్టార్టప్ గా ఎంట్రప్రేన్యూర్ ఇండియా మాగజైను ఎంపికజేయడం సంజయ్ కృషికి నిదర్శనం అన్నారు.
యువ శాస్త్రవేత్త, పురస్కార గ్రహీత సంజయ్ నెక్కంటి మట్లాడుతూ వచ్చే 15 ఏండ్లలో అంతరిక్షంలోకి మనుషులను పంపించడమే కాకుండా అక్కడ, ఇక్కడి మాదిరిగా జీవించేటటువంటి దిశగా అనేక అధ్యయనాలు కొనసాగుతున్నాయని అవన్నీ విజయ వంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. యువత క్రొత్త ఆలోచనలతో వైవిధ్యంగా తమ జీవన శైలిని మార్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నారు. తమ ధ్రువ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని అంతరిక్ష పరిశోధనలు కొవసాగిస్తున్నదని పేర్కొన్నారు. మానవ సమాజానికి అనునిత్యం ఉపయోగపడే అనేక క్రొంగొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తేబోతున్నామని అయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking