మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడవ రోజు 7 నామినేషన్లు

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 20:
7- మల్కాజిగిరి
పార్లమెంట్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా మూడవ రోజు శనివారం రోజున ( 7)మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్, ఈటెల జమున నామినేషన్లు పత్రాలు దాఖలు చేశారు.ప్రజా వెలుగు పార్టీ నుండి లోగరి రమేష్, ధర్మ సమాజ్ పార్టీ నుండి బోయిన దుర్గాప్రసాద్ యాదవ్ , ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెండ్యాల సాయి వరప్రసాద్, పెసరి కాయల పరీక్షిత్ రెడ్డి, కంటే సాయన్న నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking