మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని ఆల్కాపుర్ రోడ్డు నంబర్ 25 లో గల మహాత్మా గాంధీ పార్కులో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు ఉపేంద్రనాధ్ రెడ్డి బొమ్ము ఆద్వర్యంలో భారత దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగ రంగ వైభవంగా, ఘనంగా నిర్వహించడం, విచ్చేసిన అతిథిలందరికి ఉదయపు ఫలహారం వితరణ జేయడం, కార్యక్రమంలో పూర్తి సహకారన్నందించిన స్థానిక కౌన్సిలర్లూ ఆలస్యం నవీన్ కుమార్, బిట్లు పద్మారావు, శ్రీకాంత్ స్వామిలను గౌరవ ప్రథమంగా సన్మానించడంతో పాటు అలకాపూర్ టౌన్షిప్ (అటర్వా) సంస్థను స్థాపించి మొదటి నుండి అభివృద్ది బాటలో మణికొండకే మణిరత్నంగా టౌన్షిప్ ను తీర్చి దిద్ది స్థానికంగా ఉన్న మహాత్మాగాంధీ పార్కును ఎంతో అభివృద్ధి చేయడానికి పాటుబడ్డ స్థానిక పెద్దలు కే.ఎస్ రెడ్డి, ఎన్.వీ రావు, ఉత్తం కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రజనీ, వాసుదేవ రావు, ప్రదీప్ కుమార్, ఆకుల నరేష్, ఆనంద్, ప్రకాశ్ లను ఇతోచితంగా సన్మాణించుకొనడం జరిగినదని సిటిజన్స్ కౌన్సిల్ సహా కార్యదర్శి ఉపేంద్రనాధ్ రెడ్డి బొమ్ము తెలుపుతూ తత్ ద్వారా విచ్చేసిన అశేష ప్రజానీకానికి ఆనందమయం గావించి అన్ని ఏర్పాట్లలో సహకారన్ననన్దించిన షేక్ ఆరిఫు మొహమ్మద్ మరియు సమయానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం గావించిన సహచర మిత్రులందరికీ, ప్రజలఅందరికీ ధన్యవాదములు తెలియ పరచడమైనది.
