ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 15:
గురువారం రోజున 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా అధికారుల సమీకృత భవనం సముదాయం (ఐడిఓసి) నందు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు జెండా ఆవిష్కరోత్సవం కార్యక్రమము, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నందు ఐదు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆహాలాడకంగా అంగరంగ వైభవంగా జరిగినది.
జిల్లా కలెక్టరు గౌతమ్ పొట్రు అదనపు కల్లెక్టరు (లోకల్ బాడీస్) రాధిక గుప్తా, అదనపు కల్లెక్టరు రెవిన్యూ విజయేందర్ రెడ్డి, డిసిపి కోటి రెడ్డి ముఖ్య అతిధి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు వారిని కార్యక్రమానికి ఆహ్వానించారు. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జెండా ఆవిష్కరోత్సవము చేసి జాతీయగీతం ఆలపించినారు. అనంతరం నూతన తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని కూడా ఆలపించినారు.
ముఖ్యఅతిథి గౌరవ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి ప్రసంగం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన కార్యక్రమము ద్వారా ప్రజల వద్ద నుండి అభయస్థానం పథకంలో భాగంగా దరఖాస్తు స్వీకరించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుందని సంతోషిస్తున్నాని.
మహాలక్ష్మి పథకం క్రింద రాష్ట్ర బాలికలు మహిళలు మరియు ట్రాన్స్సెంటర్లు ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం డిసెంబర్ 9 2023 నుండి కల్పిస్తోంది .
‘అభయహస్తం’ పథకంలో భాగమైన ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా 500 రూపాయల రాయితీపై వంట గ్యాస్ సిలిండర్ సరఫరా పథకానికి జిల్లాలో అర్హులైన 74 వేల 457 మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు లక్ష 72 వేల 393 సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. జిల్లా పౌర సరఫరా సంస్థ ద్వారా 2023-24 యాసంగి పంట కాలంలో 12 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ఒక లక్షా 40 వేల 471 క్వింటాళ్ళ ధాన్యము కొనుగోలు చేసి 30 కోట్ల 94 లక్షల రూపాయలను 2 వేల 554 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమచేయడమైనది.
‘గృహజ్యోతి’ పథకం కింద మన జిల్లాలో అర్హులైన 2 లక్షల 33 వేల 515 మంది లబ్దిదారులకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితముగా సరఫరా చేయటం వలన వారు ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్ధిక ప్రయోజనం పొందారు. జీడిమెట్ల, ఉప్పల్, హబ్సిగూడ, సైనిక్ పురి, కీసర డివిజన్ కార్యాలయములలో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లాలోని 505 ప్రభుత్వ పాఠశాలలో 89 వేల 534 మంది విద్యార్థులు, మరియు జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 30 గురుకుల పాఠశాలలలో పదివేల 58 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరికి నాణ్యమైన విద్యను అందించడం కొరకు ప్రభుత్వం ప్రతి విద్యార్ధి మీద సగటున ఒక లక్ష రూపాయల వరకు వెచ్చిస్తుంది. జిల్లాలోని గురుకుల పాఠశాలలలో నూతనంగా 136 మంది ఉపాధ్యాయులను నియమించడమైనది.
జిల్లాలోని అన్ని పాఠశాలలలో స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో “అమ్మ ఆదర్శ పాఠశాల” కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల మెరుగుదలలో భాగంగా విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించిన పనులను సుమారు 12 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయడం జరిగింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మన ప్రభుత్వం ‘పంట ఋణమాఫీ పథకం’ క్రింద అర్హులైన రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయలు వరకు ఋణమాఫీ చేయటం జరుగుతున్నది. ఇప్పటివరకు మన జిల్లాలో రెండు విడతలలో 17.81 కోట్ల రూపాయల పంట ఋణాలను మాఫీ చేయటం ద్వారా 3094 మంది రైతులకు లబ్ది చేకూరింది.
ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన ‘రైతుభీమా పథకం’ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో చనిపోయిన 545 రైతుల కుటుంబాలకు 27 కోట్ల 25 లక్షలు రూపాయలను నేరుగా వారి నామినీల బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగింది.
యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసే ఉద్దేశంతో మన జిల్లాలో టాటా కంపెనీ వారి సౌజన్యంతో పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడం జరుగుతున్నది. ఇందుకుగాను జిల్లాలోని అల్వాల్, మేడ్చల్ మరియు శామీర్పేట్ ఐటీలను ఎంపిక చేసి అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది.
రోడ్లు, భవనాల శాఖ ద్వారా మన జిల్లాలో 384.08 కిలోమీటర్ల నిడివి గల రహదారులు నిర్వహించబడుతున్నాయి. 26 కోట్ల 17 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన 15 పీరియాడికల్ రెన్యూవల్ పనులలో 14 పనులు పూర్తి చేయబడినవి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జిల్లాలో ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని 24 శాతం నుండి 33 శాతానికి పెంచడానికి లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. నీలగిరి ప్లాంటేషన్ను అభివృద్ధి చేయడం జరిగింది. మేడిపల్లి, దూలపల్లి, కండ్లకోయ, నారపల్లిలలో అటవీ బ్లాకులు మరియు నాగారంలో పట్టణ ఉద్యానవనం అభివృద్ధి చేయబడ్డాయి.
‘స్వచ్ఛతనం-పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేది నుండి 9వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు పట్టణాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ వన మహోత్సవంలో భాగంగా అన్నిశాఖల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైనికులకు మరియు దేశ పౌరులకు అంతర్గత భద్రతను కల్పిస్తున్న పోలీసులకు మరోసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తో ప్రతిభావంతులైన జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసినారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి సామూహిక కార్యచరణ ద్వారా నిరంతరం కృషి చేస్తూ ఉన్నత స్థాయిలో నిలపడానికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూనన్ని కోరినారు.
సంఘటనం ఒక యజ్ఞం అనే పాటకు జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికలు) మేడ్చల్ జిల్లా బాలికల నృత్యా ప్రదర్శన అలరించారు. అలానే ఇతిహాస్ కే మే అయినా హో అనే పాటలకు ఎం.జె.పి. ఉప్పల్ విద్యార్థులు, వందనాలు వందనాలు వీరులకు అనే పాటకు గవర్నమెంట్ హై స్కూల్, మౌలాలి విద్యార్థులు, దేశ రంగీలా అనే పాటలకు జిల్లా పరిషత్ హై స్కూల్ తూముకుంట విద్యార్థులు, జయహో జయహో అనే పాటకు గుండ్ల పోచమ్మపల్లి విద్యార్థులు, నృత్యాలతో అలరించారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేసినారు. ప్రాథమిక విద్య పై ప్రాముఖ్యత తెలియజేయుటకై పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసినారు. వ్యవసాయం లో ఏ పంటలు ఏ సీజన్లో వేస్తే అభివృద్ధి చెందుతారు అనే అవగాహన పెంపొందించేందుకు గాను వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రజలు సద్వినియోగపర్చుకోవడానికి డి.ఆర్.డి.ఏ., తెలంగాణ రాష్ట్ర రోడ్డు రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ, పౌర సరఫరాల శాఖ ప్రదర్శనలు ఏర్పాట్లు నిర్వహించినారు.
కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.