నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 08.30 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మల్ నందు జిల్లా యస్.పి. డా.జానకి షర్మిల ఐ.పి.యస్. జాతీయ జెండాను ఎగరవేసి,సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా యస్.పి.మాట్లాడుతూ సిబ్బందికి,జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి,మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని,ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.బానిస సంకెళ్ళు తెంచుకొని సాధించుకున్న ఈ స్వాతంత్ర్య భారతాన్ని, రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, వారి నుండి మన దేశాన్ని కాపాడాల్సిన భాద్యత మనందరిపై ఉందని,పోలీసులుగా మన పాత్ర చాలా కీలకం అన్నారు.
మనం మన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే బార్డర్లో సైనికులు అందించే సేవలకు మన సేవలు ఏమాత్రం తీసుపోవని గుర్తు చేస్తూ,మన విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి అవినాష్ కుమార్ ఐపిఎస్,డిఎస్పీ గంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్,నవీన్ కుమార్,గోపీనాథ్, రామకృష్ణ,ఆర్.ఐ.లు రామనిరంజన్,శేఖర్, రమేష్, రామ కృష్ణ, డి.పి.ఒ ఏ ఓ యోనోస్ అలి,సూపరింటెండెంట్ లు శ్రీనివాస్ ఎస్ఐ ల,అర్ ఎస్ఐ లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ పథకాలకు ఎంపికైన వారిని అభినందించారు.
ఉత్తమ సేవ పతకం: హెడ్ కానిస్టేబుల్ జె రాందాస్,హెడ్ కానిస్టేబుల్ జ్యోతిరామ్,హెడ్ కానిస్టేబుల్ జె బాలాజీ
సేవా పథకం: డి.ఎస్.పి గంగారెడ్డి , ఎస్ఐ ఎండి గౌస్, ఏఎస్ఐ లు. ఎల్.దేవ్, సుదర్శన్,ఏఅర్ ఎస్ఐ లు సాహెబ్ రావు, గుణ్వంత్,విజయ రావు,ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ లు శంకర్, రాజేశ్వర్,అంబవ్రావు, ఉత్తమ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking