ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు*త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి.ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.ముఖ్య అతిథిగా
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్ రాజయ్య, పుర ప్రముఖులను,అధికార అనధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు.జిల్లా పంచాయతీ విభాగం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వైద్యారోగ్యం తదితర శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, ఆకట్టుకునే రీతిలో శకతాల ప్రదర్శన కొనసాగింది.వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత పలు శాఖల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ముఖ్య అతిధి చే ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్, బైంసా ఏ ఎస్పీ అవినాష్,ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, డి.ఎస్.పి గంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,పట్టణ ప్రముఖులు, విద్యార్థులు,మీడియా ప్రతినిధులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking