ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 15:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ముగ్గురు స్వాతంత్ర సమరయోధులు అనారోగ్య కారణముచే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేక పోయినందున కుత్బుల్లాపూర్ మండలంలోని జిల్లా మండల రెవెన్యూ అధికారులచే వారి ఇంటివద్దె కుందూరు రాజేందర్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, అల్వాల్ మండలంలోని శ్రీమతి జానా భాయ్ ను, సన్మానించినారు.