హైదరాబాద్ మార్చ్ 4 ();సాహితి జిగీష సాహిత్య,సంస్కృతిక సంస్థ మరియు శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సాహితి జిగీష సంస్థ అధ్యక్షులు బండారుపల్లి రామచంద్రారావు, ఉపాధ్యక్షులు రఘు శ్రీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లలిత వాణి నేడు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం 5:30 గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ లో గల గుండవరపు హనుమంతరావు కళావేదికలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలాకర భారతి, విశిష్ట అతిథులుగా విఎస్ జనార్దన్ మూర్తి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. బోయి హైమావతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రో.పివి ఉమా శశి ఆత్మీయ ప్రసంగాన్ని చేనునట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పి విజయలక్ష్మి, ఎం భారతి, బి దివ్య, పి స్రవంతి, జి పద్మావతి, వి నాగరత్నాలను సన్మానించనున్నట్లు వారు వివరించారు