ప్రభుత్వ పథకాలపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 4: శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 జి.ఓ.ల మేరకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ విజయవంతంగా నిర్వహిస్తాము అని తెలిపారు.

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాజిల్లా కలెక్టర్ను అభినందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని రకాల కార్యక్రమాలను పక్కాగా ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నామని వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు, అధికారులకు తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 58, 59లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని వివరించారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వు 118కి సంబంధించి ఆదివారం నాటికి పూర్తి చేసి లాగిన్ చేస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు.

దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వు 58, 59 పూర్తి చేయడం పట్ల కలెక్టర్ను అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ విజయవంతమయ్యేలా ఆయా శాఖల జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు తుచ తప్పకుండా పాటిస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking