ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్,
గడ ముత్యంరెడ్డి.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 9వ హరితహారం కార్యక్రమం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, గజ్వేల్ నియోజకవర్గ గడ ముత్యంరెడ్డి పాల్గొని హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గడ ముత్యంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని గత ప్రభుత్వాలలో హరితహారం మొక్కలు లేక అడవి వృక్షాలను నరికివేసి ప్రకృతికి దీనస్థితిని కలుగజేశారు. దీని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తరమైన ఆలోచనతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాడు. రాష్ట్రంలో ఇప్పటివరకు 230 కోట్ల మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకుని ఎదిగే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని ఈ చెట్ల ద్వారా వాతావరణంలో మార్పులు ఏర్పడి రుతువులు సరైన కాలంలో రావడం అధిక వర్షాలు కురిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మరియు ప్రతి పల్లె పచ్చల హారంగా తయారు చేయడం జరిగిందని దీని వలన స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని వారి సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్,ఎంపీడీవో అరుంధతి, ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి, సిఐ. సురేష్ కుమార్, స్థానిక సర్పంచ్ గుర్రం ఎల్లం, సత్యనారాయణ గౌడ్, డిఎల్పిఓ, ఎంపీఓ, ఏపీఎంలు, పాలకవర్గం సభ్యులు మహిళలు, యువతి, యువకులు, గ్రామ ప్రజలు, అధిక మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.