ముఖ్యమంత్రి ప్రకటించిన బీసీ బందు పథకం వెంటనే అమలు చేయాలి
గతం లో తీసుకున్న 5 లక్షల 77 వేల ధరఖాస్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
కేంద్రంలో 16 లక్షలు – రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
రాష్ట్ర బి.సి యువజన సంఘం రాష్ట్ర సమావేశా డిమాండ్
హైదరాబాద్ జూన్ 19 (): రాష్ట్ర ప్రభుత్వం 14 బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయల సబ్సిడీ రుణం ఇస్తామని ప్రకటించారు. 14 కులాలతో పాటు అన్ని బీసీ జాబితాలోని 130 కులాలకు కూడా లక్ష రూపాయలు పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర బి.సి యువజన సంఘం డిమాండ్ చేసింది. నేడు ఇక్కడ బి.సి యువజన సంఘం విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షతన ముఖ్య అతిధులుగా ఆర్. కృష్ణయ్య, వి.హెచ్. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎర్ర సత్యనారాయణ, అంజి, సుధాకర్, అనంతయ్య, సి. రాజేందర్,ముసిపట్ల లక్ష్మి నారాయణ , రాజ్ కుమార్, తిరుమలగిరి అశోక్, రామ కృష్ణ, సతీష్, నంద గోపాల్, రాందేవ్, మల్లేశ్ పటేల్, నాగ రామ చారి, రవి కుమార్, అఖిల్, ప్రసన్న కుమార్, శ్యామ్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బి.సి.లలో మిగతా కులాలకు ఎందుకు ఇవ్వరు. మిగతా 130 బి.సి కులాలు తిరగబడతారని హెచ్చరించారు. బీసీ జాబితాలోని అన్ని కులాలకు, కుల వృత్తులు ఉన్నాయి. ముఖ్యంగా పద్మశాలి, ముదిరాజ్, గౌడ, యిడిగ, గోల్ల, కురుమ, మున్నురుకాపు, బెస్త, బోయ, వాల్మీకి, బలిజ, లింగాయత్ తదితర 130 కులాలకు కూడా లక్ష రూపాయలు పథకాన్ని అమలు చేయాలి. మిగతా కులాలకు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో BRS పార్టీ బీసీల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక ఎన్నికలు వచ్చినప్పుడు BRS – ప్రభుత్వానికి బీసీలు గుర్తుకొస్తారు. గత 9సంవత్సరాల పాలనలో ఒక బీసీకి కూడా రుణం మంజూరు చేయలేదు ఇప్పుడు ఇస్తామని ప్రకటించారు. కానీ అది కూడ ఏ మూలకు సరిపోతుంధని ప్రశ్నించారు. బిసి కార్పొరేషన్ కు 100 కోట్లు బడ్జెట్ విడుదల చేశారు. ఇది ఏ మూలకు సరిపోదు రాష్ట్రంలోని 62 లక్షల బీసీ కుటుంబాలు యున్నవి. అందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి 10 వేల కోట్లు బడ్జెటు ఇవ్వాలని డిమాండ్ చేసారు.