హైదరాబాద్ జూన్ 19 ; . వచ్చే అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ను ప్రకటించి జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.సోమవారం బిసి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తయిన ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ పాలాలు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించరు.బిసి లంటే జండాలు మోసే కులీలా అని ఆయన ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా వాడుకునే పార్టీలకు వచ్చే ఎన్నికలలో చరమగీతం పాడాలని బీసీ శ్రే నులకు కృష్ణ యాదవ్ పిలుపు నిచ్చారు. బీసీ కులవృత్తిదారులకు ఆధునాతనమైన నైపుణ్యత శిక్షణను ఇప్పించి 100% రాయితీ రుణాలు అందించి ఉపాధి కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . క్లౌర్తి దారులకు లక్ష రూపాయల పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాసుదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఆరు నెలల సమయం కేటాయించాలని కోరారు. ఈ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి, అరవిందస్వామి, వెంకటేష్, ప్రశాంత్, గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.