మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలి తపస్.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు వినతి పత్రం.

మెదక్ జనవరి 13 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించిన తపస్ నాయకులు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని జిల్లా కేంద్రాల్లో పదవ తరగతి మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.కానీ మెదక్ లో ఏర్పాటు చేయలేదు. మెదక్ నుండి బిహెచ్ఇఎల్ కు వెళ్లి మూల్యాంకన విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ సంవత్సరమే పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మెదక్ లో ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్,నరేందర్,దేవానంద్, అనిల్, కృష్ణమూర్తి,రమేష్, రాజు, మధు మోహన్,రవి, వీరేశం, రవీందర్, బిక్షపతి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking