ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : బీఆర్ఎస్ కు భారీ షాక్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోర్లకుంట వేంకటేష్ నేత కారు దిగి హస్తం గూటికి చేరడం జరిగింది.మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి డిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేసి వేణుగోపాల్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ బోర్లకుంట వేంకటేష్ నేతకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ గూటికి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వంశీ కృష్ణ వెంకటేష్ నేత అనుచరులు తదితరులు పాల్గొన్నారు.