అతిధి డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ నాయకులు కోమ్మిడి రాకేష్ రెడ్డి.
వీణవంక ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 5
వీణవంక మండల కేంద్రానికి చెందిన గెల్లు అశోక్ యాదవ్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా, సోమవారం అతిధి డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ నాయకులు కోమ్మిడి రాకేష్ రెడ్డి 5000 రూపాయలు పంపగా రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, ముద్దుల ప్రశాంత్ లు,వీణవంక గ్రామానికి చెందిన మిత్ర బృందంతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి, మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మానవత దృక్పథంతో వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పోతరవేన సతీష్, మద్ధుల ప్రశాంత్ పటేల్, మర్రి రాజు, నయీమ్ పాషా, దసరాపు చంద్రయ్య, దసరాపు రాకేష్, తరుణ్, అజయ్, వంశీ అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు.