ఏసంగి పంటకు కడెం,గూడెం నుండి సాగు నీరు అందిస్తాం
ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 18 : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ…వర్షాకాల పంట వరి ధాన్యాముకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని అన్నారు.రైతు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవపలికారు.ఎసంగి పంటకు కడెం,గూడెం సాగు నీరు అందిస్తాం అన్నారు.ఈ కార్యక్రమం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు,వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల నలిమేల రాజు, అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిటిసిలు,కౌన్సిలర్స్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.