మల్లారెడ్డిపై కేసు నమోదు

మేడ్చెల్‌ ప్రజాబలం ప్రతినిధి: డిసెంబర్‌ 13 తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి విూద పోలీసు కేసు నమోదైంది. శావిూర్‌పేట్‌ పోలీస్స్టేషన్‌ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరువిూద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన శావిూర్‌పేట్‌ తహశీల్దార్‌ పై సైతం కేసు నమోదు అయ్యినట్లుపోలీసులు పేర్కొన్నారు.గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రులమధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking