కనీసం 50 శాతం నగదు చెల్లించని వారిపై కేసు నమోదు

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం 19 : 2022-23 సంవత్సరం రబీ సీజన్కు సంబంధించి వేలంలో ధాన్యం కోటాను దక్కించుకున్న రైస్ మిల్లర్లు కనీసం 50 శాతం నగదు చెల్లించని వారిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు.2022-23 సంవత్సరం రబీ సీజన్లో జిల్లాలోని రైస్మిల్లర్లు 63 వేల 144 మెట్రిక్ టన్నుల ధాన్యంకు వేలం పాడుకోవడం జరిగిందని,ఈ నెల 18వ తేదీ వరకు 16 శాతంతో 10 వేల 268 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అందించడం జరిగిందని, ఇంకా 52 వేల 876 మెట్రిక్ టన్నులు బకాయి ఉన్నారని, లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లాలోని 23 రైస్మిల్లర్లు వేలం సంబంధిత నగదు, నిర్దేశిత లక్ష్యం కనీసం 50 శాతం పూర్తి చేయని పక్షంలో ఈ నెల 21వ తేదీ శనివారం సంబంధిత మిల్లర్లు,పూచికత్తు ఉన్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లా నుండి 2022-23 రబీకి సంబంధించి 103 కోట్ల రూపాయల విలువ గల ధాన్యం బకాయి ఉన్నారని, ఈ విషయంపై తక్షణమే స్పందించని పక్షంలో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking