సమగ్ర మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ఏరియల్ సర్వే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 19 : ప్రభుత్వం చేపట్టిన అమృత్ 2.0 పథకంలో ఎంపికైనందున ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్-వరంగల్తో కలిసి డ్రోన్ ఏరియల్ సర్వేను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నివాస,వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు,అభివృద్ధి, ఇతర అంశాల పరిశీలన కొరకు డ్రోన్ ఏరియల్ సర్వే నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సర్వేలో భాగంగా అమృత్ 2.0 సంబంధించి నివేదిక అందిన అనంతరం తదనుగుణంగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నందున డ్రోన్ ఏరియల్ సర్వే ద్వారా భూముల సమాచారం సేకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్రెడ్డి,జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్,జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్వీరు, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, జిల్లా టౌన్ & కంట్రీ ప్లానింగ్ అధికారి, సంబంధిత అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking