జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 19 : సి.ఎం. కప్ -2024 పోటీలలో భాగంగా కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు పోటీలలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్ వీరు, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్,జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి హాజరై క్రీడాకారులతో చదరంగం పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన సి.ఎం.కప్ -2024 పోటీలను జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని,జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 2,2025 వరకు రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.క్రీడలతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు విద్య,ఉపాధి రంగాలలో రాణించేందుకు ఏకాగ్రత పెంపొందుతుందని, జీవితంలో ఎంచుకున్న ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,శిక్షకులు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking