సమగ్ర ఇంటింటి సర్వే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తుంది

 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్, నవంబర్, 7.
ప్రజాబలం న్యూస్ :-

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమగ్ర ఇంటింటి సర్వే ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో సర్వే నిమిత్తం అధికారులు సందర్శించి నప్పుడు తమ పూర్తి సమాచారాన్ని అందించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి యజమాని ఇచ్చిన వివరాలను మాత్రమే ప్రొఫార్మాలో పొందుపరచాలని ఆయన సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఇచ్చిన ఫారాల్లో సమాచారాన్ని క్రోడీకరించాలని ఆయన సూచించారు. సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మళ్లీ
(రీ స్థిక్కర్స్, రీ సర్వే ) మొదటి నుండి సర్వే నిర్వహించాలని ఆన్నారు. గ్రామాల్లోని ప్రజలు పొలాలకు ఉదయం వెళతారు గనుక ఇంట్లొ ఉన్న సమయంలో తొందరగా వెళ్ళి సర్వే నిర్వహించాలని, సెల్ఫ్, డిక్లరేషన్ భాష, కోడ్ లను జాగ్రత్తగా నమోదు చేయాలనీ ఆన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ పల్లెర్ల రవీందర్ గుప్త, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మేనేజర్ రఘువరన్ తూప్రాన్ తాసిల్దార్ విజయలక్ష్మి సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking