జమ్మికుం ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 7
జమ్మికుంట పట్టణ దీపావళి క్రాకెర్స్ నూతన అసోసియేషన్ ఎర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా బోళ్ల కార్తీక్,ఉపాధ్యక్షులు కొమురవెల్లి శివన్న,సెక్రటరీగా చొక్కారపు అఖిలేష్, జాయింట్ సెక్టరీగా దొడ్డే రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు బోల కార్తిక్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.దీపావళి క్రాకెర్స్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమములో పట్టణంలోని దీపావళి విక్రయదారులు అందరు పాల్గొని కార్యక్రము విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దీపావళి క్రాకెర్స్ అసోసియేషన్ దీపావళి విక్రయదారులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.