డివిజనల్ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 7
భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పోరాడే ఆల్ ఇండియా రైల్వమెన్ ఫెడరేషన్ యొక్క స్థానిక అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అగ్ర నాయకులైన కామ్రేడ్ పిల్లలమర్రి రవీందర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి కార్మిక పక్షపాత విధానాలకై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎస్,సి,ఆర్,ఎం,యు యొక్క జెండా గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరడం జరిగింది. రైల్వే ఉద్యోగులకు బోనస్ సాధించడంలో నాటి మజ్దూర్ యూనియన్ నాయకుల పోరాటం ఎనలేనిదని భావితరాలకు కూడా ఆదర్శం అని వారి త్యాగాలను కొనియాడారు. జమ్మికుంట బ్రాంచ్ నందు కాజీపేట మొదలు బిసిగిర్ షరీఫ్ వరకు అన్ని స్టేషన్స్ మరియు యూనిట్స్ కార్మికులు డివిజినల్ సెక్రెటరీ రవీందర్ కు మజ్దూర్ నాయకులకు అడుగడుగునా నీరాజనాలు తెలుపుతూ వారిని ఘనంగా సత్కరించారు. డిసెంబర్ 4,5,6 న ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల ప్రచారంలో, జమ్మికుంట శాఖ కార్యదర్శి బచ్చలి.శ్రీనివాస్ చైర్మన్ ఉప్పుల.రాజయ్య, ట్రెజరర్ ఏ సాంబరాజు,వైస్ చైర్మన్స్ బి.మొండయ్య,జి. స్వప్న,జి.శివ,జి.క్రాంతి కుమార్, అసిస్టెంట్ సెక్రటరీస్ ఏం. రవికుమార్,రవీందర్,కన్వీనర్ కుమార్ స్వామి,కో కన్వీనర్ ప్రవీణ్, ఇతర మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.