కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పక్కాగా జరగాలి

 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు.

తూప్రాన్, నవంబర్, 7.
ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత తాసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. సన్న రకం ధాన్యం క్రింద ఏ రకం ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. సన్న రకం దాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొనుగోలు ప్రక్రియ సజావుగా, సక్రమంగా చేపట్టాలని, రైతుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు.
సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామని తెలిపారు. సమగ్ర కార్యాచరణ తో ముందుకు పోవాలన్నారు ధాన్యం రవాణాకు కేటాయించిన వాహనాలు ఇతర పనులకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం తరలించేలా అవసరమైన వాహనాలు సన్నద్ధం చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల తాసిల్దార్ విజయలక్ష్మి కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking