పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పౌర సేవలకు గుర్తింపు పత్రాల జారీ లో ఆలస్యం చేయకూడదన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తు పత్రాలను వెంటవెంటనే పరిశీలించాలని తెలిపారు.మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న పౌర సేవల గుర్తింపు పత్రాల దరఖాస్తులు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ దరఖాస్తుల వివరాలను తహసిల్దారులను అడిగి తెలుసుకున్నారు. మండలాలకు సంబంధించిన పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు,ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.వీటికి సంబంధించిన కోర్టు కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేవిధంగా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. తహసిల్దార్లంతా క్షేత్రస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. అన్ని మండలాల పరిధిలలో గల ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో భూముల సర్వే నిర్వహించి హద్దులను నిర్ణయించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్,కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు,ఈడీఎం నదీమ్, అన్ని మండలాల తహసిల్దార్లు,రెవెన్యూ అధికారులు,ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.