శ్రీసమ్మక్క-సారలమ్మ మహ జాతరకు నిధులు మంజూరు చేయాలని ఐటిడిఎ పీఓకు వినతి పత్రం అందించిన పూజారుల సంఘం

ప్రజాబలం ఏటూరునాగారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిథి నవంబర్ 7:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపురం గ్రామంలో 2025 పిబ్రవరి నెలలో 12నుండి15 తారీకు వరకు మఘు శుద్ధ పౌర్ణమిలో జరిగు శ్రీసమ్మక్క-సారళమ్మ మహా జాతరకు నిధులు మంజూరు చేయాలని శ్రీసమ్మక్క-సారళమ్మ ఐలాపురం పూజారుల సంఘం అధ్యక్షులు మల్లెల రవి ఆధ్వర్యంలో గురువారం రోజు ఏటూరునాగారం పీఓ చిత్రా మిశ్రాకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందచేశారు ఈ సందర్బంగా మల్లెల రవి మాట్లాడుతూ ఐలాపురం శ్రీసమ్మక్క-సారలమ్మ మహాజాతరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,చత్తీస్ఘడ్,మహారాష్ట్ర సరిహద్దుల్లో నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు రవాణా,మంచినీటి,విధ్యుత్,పారిశుధ్య పనులకు,తదితర అంశాలకు భక్తులకు పర్మినెంట్ సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో పీరీల భాస్కర్,గ్రామ కొమరం భీమ్ యూత్ అధ్యక్షులు పీరీల సురేష్,పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking