దళిత బంధు సన్నవడ్లకు బోనస్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 

– సమగ్ర కులగణన సర్వే దేశానికే ఆదర్శం.
– దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి.
– ఆందోళన వద్దు 500 బోనస్ ఇచ్చి తీరుతాం.
– ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యలకు ప్రజాప్రభుత్వంలో పరిష్కారం అయ్యేలా కృషి.
– ఎమ్మెల్యే భూ కబ్జాల బాగోతం ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం.
– కౌశిక్ నువ్వొక రాజకీయ బచ్చావి,కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు.
– ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకత పాటిస్తాం.

కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 7

హుజురాబాద్ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. హుజురాబాద్ అభివృద్ధిపై మేము దృష్టిసారిస్తే ఒక్క రూపాయి కూడా పనిచేయకుండా భూకబ్జాలకు వంతపాడుతూ, రాజకీయపబ్బం గడుపుతున్నారని ఎద్దేవాచేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్ట మొదటిసారిగా తెలంగాణలో రాహుల్ గాంధీ సూచనల మేరకు రేవంత్ రెడ్డి సారథ్యంలో సమగ్ర కులగణన చేపడుతున్నామని దీనికి ప్రతి ఒక్కరు తమ వివరాలను అధికారులకు తెలుపాలని కోరారు. రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉండి, ప్రభుత్వ విప్ గా పనిచేసి దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఇప్పుడు టెంట్ వేసుకొని కూర్చోవడం చంపినోడే సంతాపం తెలిపినట్టు ఉంటుందని ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుందని, ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప దళితుల కోసం ఏనాడు ఆలోచించలేదని మరోసారి కౌశిక్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని త్వరలో రెండవవిడత దళిత బంధు అందజేస్తామని మునుపటిలాగా దళారివ్యవస్థ లేకుండా చూస్తామని ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అన్ని వివరాలు సమర్పించామని అన్నారు. అలాగే వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని, చెప్పిన మాట ప్రకారం రైతులకు సన్నవడ్లకు క్వింటాకి 500 బోనస్ ఖచ్చితంగా ఇస్తామని దీనిపై రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కొనుగోలుపై మంత్రులు, కలెక్టర్, నేను సమీక్ష జరిపామని కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని అన్నారు. రుణమాఫీ విషయంలో ఇప్పటికే 2లక్షల వరకు మాఫీ అయ్యాయనీ, సాంకేతిక కారణాల వలన రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ఇప్పుడు దాన్ని సర్దిద్దుకుంటున్నామని అన్నారు. ఈసారి వర్షాలు కొంత ఆలస్యంగా పడడం వల్ల చెరువులో చేపలు కలపడం లేట్ అయిందని అయినా కూడా ఇప్పటివరకు 50 శాతం పూర్తి చేసామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ కార్యక్రమానికి తేడా తెలవని అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో రొయ్యపిల్లలను ఎక్కడ కలిపారో చూపించాలని కోరారు.తన సొంత మండలమైన వీణవంకలో సాక్షాత్తు ఎమ్మెల్యే, అతని అనుచరుడు భూకబ్జాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణ చేశారు. అమెరికాలో ఉంటున్న శివప్రియ భూమి ఆక్రమణ చేసి తద్వారా సంబంధిత ఎమ్మార్వో ను ఒత్తిడి చేసి సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని ఇది నిజం కాదా చెప్పాలని కోరారు.వీణవంక మండల రెవెన్యూ అధికారి ధరణి ఆపరేటర్ సస్పెండ్ అయ్యారని దీనికి సమాధానం చెప్పాలని ఒక్కొక్కటిగా హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి చేసిన భూ దందాలు బయటికి తీస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏల్లుగా పరిష్కారం కానీ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపిస్తున్నామని అందులో భాగంగానే హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ వారు అడగగానే ఎంత కష్టమైనా పదిలక్షల రూపాయలతో వాకర్స్ ట్రాక్ పాఠశాల మైదానానికి గేట్ అమలుకు ఉత్తర్వులు మంజూరు అయ్యాయని అన్నారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధికి మరింత బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు విషయంలో కూడా పారదర్శకత పాటిస్తామని అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని హుజురాబాద్ లో అడుగుకూడా పెట్టనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking