గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంజేమార్కెట్ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఘనంగా కేక్ కోసి రేవంత్ రెడ్డి జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా టీపీసీసీ కార్యదర్శి బండ ఆశోక్ మాజీ కార్పోరేటర్లు మమతా గుప్త, పరమేశ్వరి సింగ్ విచ్చేసినారు.ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి బండ ఆశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గడిల పాలననుంచి తెలంగాణాను విముక్తి కలిగించి హైదరాబాద్‌కు ముఖ్యమైనమూసీ నదిని పునర్జీవనం కలిగించాడానికి కృషి చేస్తున్నారు.హైదరాబాద్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటారని అన్నారు.మాజీ కార్పోరేటర్లు మమతా గుప్త, పరమేశ్వరి సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్దంగా సతీష్ గౌడ్, నిర్మల్ కుమార్ యాదవ్,వి. జీ.పురుషోత్తం ,వంజరి శ్రీనివాస్ ,రాజకుమార్, ధనరాజ్, సంతోష్ గుప్త చిట్టీ, రాధా కృష్ణ,కామలుద్దీన్, యోగి,చిన్న నగేష్, రాబర్ట్.తదితరులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్యఅతిధులకు కాంగ్రెస్ నాయకులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేష్ ధన్యవాదాలు తెలియజేశారు.